Chandigarh: చండీగఢ్ లో ఎయిర్ సైరన్.. ఇళ్లల్లోనే ఉండాలని ప్రజలకు హెచ్చరిక

––
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. శుక్రవారం ఉదయం నుంచి కుప్వారా, యూరీలలో పాక్ సైనికులు తీవ్ర స్థాయిలో కాల్పులకు పాల్పడుతున్నారు. భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది. గురువారం పాక్ సైనికులు జరిపిన కాల్పులకు ఐదుగురు చిన్నారులు సహా మొత్తం పదహారు మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దు రాష్ట్రం పంజాబ్ లోని చండీగఢ్ లో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు. ఎయిర్ ఫోర్స్ అధికారులు సైరన్ మోగించి అప్రమత్తం చేశారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని మైక్ ల ద్వారా హెచ్చరించారు. డాబాపైకి, బాల్కనీలలోకి రావొద్దని సూచించారు.