ఆమిర్ ఖాన్‌తో అల్లు అర్జున్ భేటీ.. ఎందుకంటే..?

  • ముంబయికి వెళ్లి ఆమిర్ ఖాన్ తో సమావేశమైన అల్లు అర్జున్
  • ఈ భేటీ మహాభారతం మూవీ కోసమే అంటూ ఇండస్ట్రీలో టాక్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భేటీ అయ్యారు. ముంబయిలోని ఆమిర్ నివాసానికి ప్రత్యేకంగా వెళ్లిన బన్నీ ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అయితే, అకస్మాత్తుగా ఆమిర్‌తో బన్నీ సమావేశం కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు రాబోతోందని, అందుకోసమే ఆమిర్‌తో బన్నీ భేటీ అయి చర్చించారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'సితారే జమీన్ పర్' పనుల్లో బిజీగా ఉన్న ఆమిర్ ఖాన్ ఆ తర్వాత భారీ బడ్జెట్‌తో మహాభారతం మూవీ తీయాలని చూస్తున్నాడు.

ఈ మూవీలో స్టార్ హీరోలు నటిస్తారని ఆయన ఇటీవల ప్రకటించారు. తాజాగా బన్నీ వెళ్లి ఆమిర్‌తో భేటీ కావడంతో మహాభారతం మూవీ కోసమే అన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ, అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. 


More Telugu News

Allu Arjun Aamir Khan Mahabharata Movie Bollywood Tollywood Telugu Cinema Indian Cinema Movie Collaboration Upcoming Project Bunny