ఆపరేషన్ సిందూర్ పై చిరంజీవి, రజనీకాంత్, షర్మిల స్పందన

  • 'జై హింద్' అని ట్వీట్ చేసిన చిరంజీవి
  • పాక్ పై పోరాటం ఇప్పుడే ప్రారంభమైందన్న రజనీకాంత్
  • పాక్ ఉగ్ర స్థావరాలపై సైన్యం దాడులు చేయడం హర్షణీయమన్న షర్మిల
పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం కావడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు ధ్వంసం చేశారు. ఈ సాహసోపేత చర్యకు రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ మద్దతు తెలుపపుతూ, భారత సైన్యాన్ని అభినందిస్తున్నారు.

ఎక్స్ వేదికగా చిరంజీవి స్పందిస్తూ... 'జై హింద్' అని పోస్టు పెట్టారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ, పాకిస్థాన్‌పై పోరాటం ఇప్పుడే ప్రారంభమైందని, లక్ష్యం పూర్తయ్యేవరకూ ఆగదని అన్నారు. దేశం మొత్తం సైన్యంతోనే ఉందని, జైహింద్ అని ట్వీట్ చేశారు. 

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల స్పందిస్తూ... పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం ప్రతిదాడులు చేయడం హర్షణీయమని, ఇది దేశానికి గర్వకారణమని అన్నారు. భారత సైన్యానికి శుభాకాంక్షలు తెలుపుతూ, "జై హింద్.. జై భారత్" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.


More Telugu News