రేపు ఓటీటీకి వస్తున్న తెలుగు సినిమాలివే!

OTT Movies Update
  • సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా 'జాక్'
  • ఈ నెల 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో 
  • ప్రదీప్ హీరోగా రూపొందిన లవ్ స్టోరీ 
  • ఈ నెల 8 నుంచి ఈటీవీ విన్ లో

రేపు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రెండు తెలుగు సినిమాలు అడుగుపెడుతున్నాయి. ఒకటి 'జాక్' అయితే, మరొకటి 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ రెండు సినిమాలు కూడా క్రితం నెలలో థియేటర్లకు వచ్చినవే. 'జాక్' విషయానికి వస్తే, సిద్ధూ జొన్నలగడ్డ - వైష్ణవీ చైతన్య ప్రధానమైన పాత్రలను పోషించారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా, ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది.

అలాంటి ఈ సినిమా ఇప్పుడు 'నెట్ ఫ్లిక్స్' ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి, థియేటర్స్ వైపు నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ఇక ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందనేది చూడాలి.ఇక ప్రదీప్ హీరోగా చేసిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా, ఈ నెల 8వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను వదిలారు. భరత్ - నితిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో, కథానాయికగా 'దీపిక' పరిచయమైంది. ఏప్రిల్ 11వ తేదీన థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్ అవుతుందో చూడాలి. 

Go Back to Shorts
Siddu Jonnalagadda
Vaishnavi Chaitanya
Jack Telugu Movie
OTT Release
Netflix
Akkaada Ammayi Ikkaada Abbayi
Etv Win
Telugu Movies on OTT
Pradeep
Deepa

More Telugu News