హైదరాబాదులో మిస్ వరల్డ్ పోటీలపై సోనూ సూద్ స్పందన

  • ఈ నెల 10 నుండి హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు
  • ఇవి అందాల పోటీలు మాత్రమే కాదు అందులో మంచి లక్ష్యం దాగి ఉందన్న నటుడు సోనూసూద్
  • మిస్ వరల్డ్ పోటీల కోసం తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా ఏర్పాట్లు చేసిందని కితాబు
హైదరాబాద్‌లో ఈ నెల 10న మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం కానున్న విషయం విదితమే. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు సోనూసూద్ ఈ అందాల పోటీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవి కేవలం అందాల పోటీలు మాత్రమే కావని, వీటిలో ఒక మంచి లక్ష్యం దాగి ఉందని సోనూసూద్ అన్నారు. మిస్ వరల్డ్ పోటీల కోసం తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని ఆయన ప్రశంసించారు. విమానాశ్రయం నుంచి హోటల్స్‌కు చేరుకునే వరకు అతిథులకు చక్కటి వసతులు కల్పించారని తెలిపారు.

రానున్న 25 రోజులు ఎంతో ప్రత్యేకమని సోనూసూద్ పేర్కొన్నారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం కంటే గొప్పగా మరొకరు నిర్వహించలేరని నిరూపించాలని సోనూసూద్ ఆకాంక్షించారు. 


More Telugu News