రేపటి మాక్ డ్రిల్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. రేపు సివిల్ మాక్ డ్రిల్ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తవచ్చన్న అంచనాలతో మదుపరులు అప్రమత్తత పాటించారు. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో 80,641కి పడిపోయింది. నిఫ్టీ 81 పాయింట్లు కోల్పోయి 24,379 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 84.43గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
భారతి ఎయిర్ టెల్ (1.66%), టాటా స్టీల్ (1.62%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.59%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.28%), నెస్లే ఇండియా (1.06%).

టాప్ లూజర్స్
టాటా మోటార్స్ (-3.08%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.01%), అదానీ పోర్ట్స్ (-1.96%), ఎన్టీపీసీ (-1.95%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.78%).

India-Pakistan tensions
Civil Mock Drill
Sensex
Nifty
Stock Market Crash
Rupee Dollar Exchange Rate
BSE
Top Gainers
Top Losers
Tata Motors

More Telugu News