ఓటీటీలో దూసుకుపోతున్న 'అయ్యన మనే' సిరీస్!

Ayyana Mane Movie Update
 కన్నడ నుంచి మొదటిసారిగా ఒక వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఆ సిరీస్ పేరే 'అయ్యన మనే'. ఒక పెద్దాయన ఇంటిచుట్టూ తిరిగే కథ ఇది. ఇటీవలే ఈ సిరీస్ 'జీ 5'లో స్త్రీమింగ్ కి వచ్చింది. అప్పటి నుంచి ఈ సిరీస్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. 5 రోజులలోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో రికార్డు సృష్టించింది. 

ఫస్టు సీజన్ లో భాగంగా 6 ఎపిసోడ్స్ ను వదిలారు. రమేశ్ ఇందిర దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం కన్నడ .. హిందీ భాషలలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సిరీస్, త్వరలో తెలుగులోను అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖుషీ రవి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ లో, మాన్సీ సుధీర్ .. విజయ్ శోభరాజ్ .. అక్షయ్ నాయక్ .. హితా చంద్రశేఖర్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు. 

 కథలోకి వెళితే .. ఆ గ్రామంలోని పెద్దాయన ఇంటికి 'జాజి' కొత్త కోడలుగా వస్తుంది. తనకంటే ముందుగా వచ్చిన ముగ్గురు కోడళ్లు అనుమానాస్పద స్థితిలో మరణించారని తెలుసుకుంటుంది. ఆ ఇంటికి గల శాపమే అందుకు కారణమని పనిమనిషి ద్వారా వింటుంది. అసలు ఏం జరుగుతుందనేది రహస్యంగా గమనించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆమెకి తెలిసే నిజాలు ఏమిటి? అనేది కథ. 

Go Back to Shorts
Ayyana Mane
Kannada Web Series
Zee5
Crime Thriller
Khushee Ravi
Ramesh Indira
Indian Web Series
OTT Platform
Streaming Success
Suspense

More Telugu News