Ayyana Mane: ఓటీటీలో దూసుకుపోతున్న 'అయ్యన మనే' సిరీస్!

- కన్నడలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్
- కొత్త కోడలి చుట్టూ తిరిగే కథ
- జీ 5ల అందుబాటులోకి
- 6 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్
కన్నడ నుంచి మొదటిసారిగా ఒక వెబ్ సిరీస్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఆ సిరీస్ పేరే 'అయ్యన మనే'. ఒక పెద్దాయన ఇంటిచుట్టూ తిరిగే కథ ఇది. ఇటీవలే ఈ సిరీస్ 'జీ 5'లో స్త్రీమింగ్ కి వచ్చింది. అప్పటి నుంచి ఈ సిరీస్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. 5 రోజులలోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో రికార్డు సృష్టించింది.
ఫస్టు సీజన్ లో భాగంగా 6 ఎపిసోడ్స్ ను వదిలారు. రమేశ్ ఇందిర దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం కన్నడ .. హిందీ భాషలలో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సిరీస్, త్వరలో తెలుగులోను అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖుషీ రవి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ లో, మాన్సీ సుధీర్ .. విజయ్ శోభరాజ్ .. అక్షయ్ నాయక్ .. హితా చంద్రశేఖర్ ఇతర పాత్రలలో కనిపించనున్నారు.
కథలోకి వెళితే .. ఆ గ్రామంలోని పెద్దాయన ఇంటికి 'జాజి' కొత్త కోడలుగా వస్తుంది. తనకంటే ముందుగా వచ్చిన ముగ్గురు కోడళ్లు అనుమానాస్పద స్థితిలో మరణించారని తెలుసుకుంటుంది. ఆ ఇంటికి గల శాపమే అందుకు కారణమని పనిమనిషి ద్వారా వింటుంది. అసలు ఏం జరుగుతుందనేది రహస్యంగా గమనించడం మొదలు పెడుతుంది. అప్పుడు ఆమెకి తెలిసే నిజాలు ఏమిటి? అనేది కథ.