కరీంనగర్ సహా పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు... ఉలిక్కిపడ్డ జనం
- తెలంగాణలోని పలు ఉత్తర జిల్లాల్లో భూప్రకంపనలు
- కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లిలో ప్రభావం
- కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం ఆందోళన
- భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన స్థానికులు
కరీంనగర్లో తీవ్రత
ముఖ్యంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. జిల్లాలోని చొప్పదండి, గంగాధర, రామడుగు మండలాల్లో భూమి కొన్ని క్షణాల పాటు తీవ్రంగా కంపించినట్లు స్థానికులు తెలిపారు. ఇళ్లు, భవనాలు కూడా కంపించాయని వారు చెప్పారు. కొందరు స్థానికులు రెండు సార్లు భూమి తీవ్రంగా కంపించిందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని సమాచారం. భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.