పహల్గామ్ దాడి... మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచన
- పహల్గామ్ దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం
- భద్రతా సంసిద్ధతను సమీక్షించాలని రాష్ట్రాలకు సూచన
- పౌరులకు అత్యవసర స్పందనపై అవగాహన కల్పించాలని స్పష్టీకరణ
భద్రతా పరమైన సంసిద్ధతను పరీక్షించేందుకు వీలుగా ఈ బుధవారం ప్రత్యేకంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు జారీ చేసింది. అంతేకాకుండా, ఈ మాక్ డ్రిల్స్ సందర్భంగా భద్రతా సన్నద్ధతపై సాధారణ పౌరులకు కూడా అవగాహన కల్పించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా ఊహించని, అత్యవసర పరిస్థితి తలెత్తితే ఏ విధంగా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై ప్రజలకు తెలియజేయాలని సూచించింది.