Pakistan: ఉద్రిక్తతల వేళ... రెండో క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్

Pakistan Conducts Second Missile Test Amidst Tensions with India
  • 120 కిలోమీటర్ల రేంజ్ మిస్సైల్ ను పరీక్షించిన పాక్
  • క్షిపణ పరీక్ష విజయవంతమైందని పాక్ సైన్యం ప్రకటన
  • ఇటీవలే తొలి మిస్సైల్ టెస్ట్ చేసిన పాకిస్థాన్
భారత్ తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ రెండో క్షిపణి పరీక్షించింది. 120 కిలోమీటర్ల రేంజ్ మిస్సైల్ ను ప్రయోగించింది. తమ సైనిక దళాల కార్యాచరణ సంసిద్ధతను ఎప్పటికప్పుడు నిర్ధారించుకోవడంతో పాటు, కీలకమైన సాంకేతిక పరామితులను ధృవీకరించుకోవడమే ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశమని పాకిస్థాన్ మిలిటరీ మీడియా విభాగం వెల్లడించింది. క్షిపణి పరీక్ష విజయవంతమైందని తెలిపింది.

దేశ రక్షణ, సైనిక కార్యకలాపాల దృష్ట్యా దళాలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయో తెలుసుకోవడం అత్యవసరమని, దానిలో భాగంగానే ఈ పరీక్షను విజయవంతంగా చేపట్టినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా, ఈ ప్రయోగం ద్వారా ముఖ్యమైన సాంకేతిక అంశాలను, వాటి పనితీరును పరిశీలించి, ధృవీకరించుకున్నట్లు పేర్కొన్నాయి.

అయితే, ఈ ప్రయోగాన్ని ఎప్పుడు, ఎక్కడ నిర్వహించారు, ఏ రకమైన ఆయుధ వ్యవస్థను పరీక్షించారు వంటి నిర్దిష్ట వివరాలను మాత్రం పాక్ సైన్యం వెల్లడించలేదు. కేవలం తమ దళాల సంసిద్ధతను, సాంకేతిక సామర్థ్యాన్ని సమీక్షించుకునేందుకే ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు మాత్రమే పాకిస్థాన్ మిలిటరీ స్పష్టం చేసింది. ఇటీవలే పాక్ తొలి క్షిపణి పరీక్ష చేపట్టింది. తాజాగా ఈరోజు మరో క్షిపణి పరీక్షను నిర్వహించింది.
Pakistan
Missile Test
India-Pakistan Tension
Military Exercise
Defense
120km Missile
South Asia
Geopolitics
National Security
Pakistan Military

More Telugu News