హరిహర వీరమల్లు చిత్రీకరణలో పాల్గొన్న పవన్
- హరి హర వీరమల్లు చిత్రీకరణపై కీలక అప్డేట్ చెప్పిన చిత్ర నిర్మాత ఎ.ఎం రత్నం
- షూటింగ్ లో పవన్ కల్యాణ్ పాల్గొన్నట్లు వెల్లడించిన చిత్ర బృందం
- సోషల్ మీడియాలో చిత్రబృందం ట్వీట్ వైరల్
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియో గ్లింప్స్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మొదటి భాగానికి సంబంధించి చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అయితే, పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది.
తాజాగా ఆదివారం నాడు పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' షూటింగ్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ 'ఎక్స్' వేదికగా తెలియజేసింది. రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఈ షూటింగ్లో పాల్గొంటారని తెలిపింది.
"చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఎక్స్‌ప్లోజివ్ ట్రైలర్, ఎలక్ట్రిఫైయింగ్ పాటల కోసం సిద్ధంగా ఉండండి! తుఫానుకు కౌంట్ డౌన్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది" అని నిర్మాత ఏఎం రత్నం ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.