అల్లు అర్జున్ కోసం ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్

  • అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ తదుపరి చిత్రం
  • ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్ర‌త్యేకంగా సన్నద్ధమవుతున్న ఐకాన్ స్టార్‌
  • ఈ మూవీ కోసం బ‌న్నీకి ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ శిక్ష‌ణ‌
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే ఈ ప్రాజెక్టుపై నిర్మాణ‌ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ అధికారిక ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేసింది. ఇది డిఫ‌రెంట్ జోన‌ర్‌లో తెర‌కెక్క‌నున్న ప్రాజెక్ట్‌. దాంతో ఈ మూవీ కోసం బ‌న్నీ ప్ర‌త్యేకంగా సన్నద్ధమవుతున్నారు. అల్లు అర్జున్ ఈ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని స‌మాచారం. అందుకు త‌గ్గ‌ట్టుగా త‌న శ‌రీర ఆకృతిని మార్చుకునే ప‌నిలో ప‌డ్డారు.

తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఈ సినిమా కోసం బ‌న్నీకి శిక్షణ ఇవ్వనున్నార‌ని తెలుస్తుంది. ఇక‌, స్టీవెన్స్‌కు టాలీవుడ్‌తో మంచి అనుబంధం ఉంది. గతంలో ఆయన తార‌క్‌, మహేశ్‌ బాబు వంటి స్టార్ హీరోలకు ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇచ్చారు. 

తాజాగా తాను ఐకాన్ స్టార్‌తో క‌లిసి ప‌ని చేయ‌బోతున్న‌ట్లు స్టీవెన్స్ వెల్ల‌డించారు. ఈ విషయాన్ని ఆయ‌న ఈరోజు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ద్వారా వెల్ల‌డించారు. అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీతో క‌లిసి దిగిన ఓ ఫొటోను ఆయ‌న పంచుకున్నారు. ఇప్పుడు స్టీవెన్స్ ట్వీట్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. లాయిడ్ స్టీవెన్స్ రాకతో అట్లీ మూవీలో బ‌న్నీ సరికొత్త లుక్‌లో కనిపించ‌డం ఖాయ‌మ‌ని అభిమానులు అంటున్నారు. 


More Telugu News