కాస్త గ్యాప్ తర్వాత సన్ రైజర్స్ మ్యాచ్... టాస్ అప్ డేట్ ఇదిగో!
- చివరిగా ఏప్రిల్ 25న మ్యాచ్ ఆడిన సన్ రైజర్స్
- విరామం లభించడంతో మాల్దీవులు వెళ్లొచ్చిన హైదరాబాద్ టీమ్
- నేడు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ తో సన్ రైజర్స్ ఢీ
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ కాస్త గ్యాప్ తర్వాత మ్యాచ్ ఆడుతోంది. చివరిగా ఏప్రిల్ 25న చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన సన్ రైజర్స్ ఆ మ్యాచ్ లో నెగ్గింది. విరామం రావడంతో సన్ రైజర్స్ ఆటగాళ్లు మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లొచ్చారు. ఇవాళ సన్ రైజర్స్ టీమ్ గుజరాత్ టైటాన్స్ తో తలపడుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ కమిన్స్ వెల్లడించాడు. మరోవైపు, గుజరాత్ టైటాన్స్ జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. కరీమ్ జనత్ స్థానంలో గెరాల్డ్ కోట్జీ ఆడుతున్నాడు.
పాయింట్ల విషయానికొస్తే... సన్ రైజర్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ 9వ స్థానంలో కొనసాగుతోంది. అటు, గుజరాత్ టైటాన్స్ పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. గుజరాత్ ఇప్పటిదాకా 9 మ్యాచ్ లు ఆడి 6 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
సన్ రైజర్స్ ఇకపై తాను ఆడే ప్రతి మ్యాచ్ లోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయన్న నేపథ్యంలో... నేడు గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో చావోరేవో అన్నట్టుగా బరిలో దిగుతోంది.