విజ‌య్ దేవ‌ర‌కొండ 'కింగ్డ‌మ్' నుంచి అదిరిపోయే పోస్ట‌ర్‌

Vijay Deverakondas Kingdom Stunning New Poster Released
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'కింగ్డమ్'. జాతీయ అవార్డు గ్ర‌హీత ద‌ర్శ‌కుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య‌దేవ‌ర‌ నాగవంశీ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ స‌ర‌స‌న యంగ్ బ్యూటీ భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. 

ఈ మూవీలో రౌడీ బాయ్‌ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌, ఇంటెన్స్ టైటిల్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా నుంచి మ‌రో వైల్డ్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. 

కింగ్డమ్ మాసం ప‌రిపాలించ‌డానికి సిద్ధంగా ఉంది అనే క్యాప్ష‌న్‌తో కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక‌, ఈ చిత్రంపై రౌడీబాయ్‌ ఫ్యాన్స్ చాలా ఆశలుపెట్టుకున్నారు. ఇటీవల కాలంలో ఆయ‌న నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ‌ప‌ర‌చ‌డంతో ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. 
Go Back to Shorts
Kingdom
Vijay Deverakonda
Kingdom Movie
Gautam Tinnanuri
Sithara Entertainments
Bhagyashree Bose
Pan India Film
New Poster
Tollywood
Telugu Cinema
Box Office

More Telugu News