అమెరికా జాతీయ భద్రతా సలహాదారుపై వేటు.. కారణమిదే!
- జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్‌పై అధ్యక్షుడు ట్రంప్ వేటు
- తాత్కాలిక ఎన్ఎస్ఏగా విదేశాంగశాఖ మంత్రి రుబియో నియామకం
- హూతీ తిరుగుబాటుదారులపై దాడుల సమాచారం ముందుగానే పాత్రికేయుడికి
- వాల్జ్ చిన్న పొరపాటు కారణంగా ఇది జరిగిన వైనం
యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులపై దాడులకు సంబంధించిన సమాచారం ముందుగానే సిగ్నల్ యాప్ చాట్ ద్వారా ఓ పాత్రికేయుడికి చేరింది. తాను అధికారులతో క్రియేట్ చేసిన గ్రూపులో వాల్జ్ పొరపాటున ఆ పాత్రికేయుడిని చేర్చడం ద్వారా ఇది జరిగింది. దీనికి తనదే బాధ్యత అని వాల్జ్ ప్రకటించారు. దాంతో ఆయనను ఎన్ఎస్ఏ పదవి నుంచి ట్రంప్ తొలగించారు.