ఫ్లైఓవర్ పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య.. బీహెచ్ఈఎల్ లో ఘోరం
--
అయితే, తీవ్ర గాయాల కారణంగా యువకుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఎవరు.. ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడనే వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు.