వైట్ హౌస్ లోపల ఎలా ఉంటుందంటే.. వీడియో ఇదిగో!

--
అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అనుమతి లేనిదే లోనికి ప్రవేశించే అవకాశమే లేదు. ఫొటోలు, వీడియోలలో ఇప్పటి వరకు వైట్ హౌస్ ను బయట నుంచి మాత్రమే చూడొచ్చు. లోపల ప్రెస్ రూమ్ మినహా లోపలి గదులు ఎలా ఉంటాయనేది అందులో పనిచేసే సిబ్బందికి తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదు. 

అయితే, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సెక్రటరీ కరోలినా లీవిట్ తాజాగా వైట్ హౌస్ హోమ్ టూర్ వీడియోను రూపొందించారు. మరో మహిళతో కలిసి వైట్ హౌస్ లోపల ఎలా ఉంటుందనేది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది. వైట్ హౌస్ లో తన రూమ్, తనతో పాటు పనిచేసే ఉద్యోగులు, ఫర్నీచర్ తదితర వివరాలను కరోలినా లీవిట్ ఈ వీడియోలో చూపించారు.


More Telugu News