ఏపీ పూర్తిస్థాయి డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా!

  • ప్ర‌స్తుతం ఇన్‌చార్జి డీజీపీగా కొన‌సాగుతున్న హరీశ్‌కుమార్ గుప్తా
  • ఢిల్లీలో నిన్న‌ యూపీఎస్సీ ప్ర‌తినిధి, కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి, రాష్ట్ర సీఎస్‌తో కూడిన ప్యాన‌ల్ డీజీపీ ఎంపికపై భేటీ
  • డీజీ హోదా ఉన్న అధికారుల పేర్ల‌తో జాబితా పంపిన రాష్ట్ర ప్ర‌భుత్వం  
  • ఆ జాబితా నుంచి అంజ‌నీకుమార్, హరీశ్‌కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్ర‌తాప్ రెడ్డి పేర్ల‌ ఎంపిక
  • హరీశ్‌కుమార్ గుప్తాను పూర్తిస్థాయి డీజీపీగా నియ‌మించిన ప్ర‌భుత్వం 
ప్ర‌స్తుతం ఇన్‌చార్జి డీజీపీగా కొన‌సాగుతున్న హరీశ్‌కుమార్ గుప్తాను పూర్తిస్థాయిలో పోలీస్ బాస్‌గా నియ‌మించేందుకు రంగం సిద్ధ‌మైంది. ఢిల్లీలో బుధ‌వారం యూపీఎస్సీ ప్ర‌తినిధి, కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి, రాష్ట్ర సీఎస్‌ కె. విజ‌యానంద్‌తో కూడిన ప్యాన‌ల్ డీజీపీ ఎంపిక విష‌య‌మై భేటీ అయింది. డీజీ హోదా ఉన్న అధికారుల పేర్ల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం పంపిన జాబితా నుంచి అంజ‌నీకుమార్, హరీశ్‌కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్ర‌తాప్ రెడ్డి పేర్ల‌ను ఎంపిక చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వీరిలో నుంచి ఒక‌రిని డీజీపీగా నియ‌మించ‌వ‌చ్చు. 

కాగా, ఈ ఏడాది ప్రారంభంలో హరీశ్‌కుమార్ గుప్తాను ప్ర‌భుత్వం ఇన్‌చార్జి డీజీపీగా నియ‌మించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ప‌నితీరు సంతృప్తిక‌రంగా ఉండ‌డంతో ఆయ‌న‌నే పూర్తిస్థాయి డీజీపీగా నియ‌మించాల‌ని ప్ర‌భుత్వం  నిర్ణ‌యించింది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. నియామ‌క ఉత్త‌ర్వులు జారీ చేసిన రోజు నుంచి రిటైర్‌మెంట్ వ‌య‌సుతో సంబంధం లేకుండా రెండేళ్లపాటు హరీశ్‌కుమార్ గుప్తా ఈ ప‌ద‌విలో కొన‌సాగుతారు.  


More Telugu News