సింహాచలం మృతులకు రూ. 25 లక్షల పరిహారం
- రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి ఏడుగురు భక్తుల మృతి
- క్షతగాత్రులకు రూ. 3 లక్షల చొప్పున పరిహారం
- ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- మంత్రులు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్
టెలికాన్ఫరెన్స్లో మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయస్వామి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై వివరాలు అడిగి తెలుసుకున్న చంద్రబాబు ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు.