పద్మభూషణ్ అందుకున్న బాలయ్యకు చంద్రబాబు అభినందనలు
- ఢిల్లీలో పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణ
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారం
- సోషల్ మీడియాలో స్పందించిన చంద్రబాబు
- కళా, సేవా, రాజకీయ రంగాల్లో బాలకృష్ణ తనదైన ముద్ర వేశారని ప్రశంస
- భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోవడం పట్ల సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్‌ను స్వీకరించారు. దీనిపై చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు.
కళారంగంతో పాటు సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లోనూ బాలకృష్ణ తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారని చంద్రబాబు ప్రశంసించారు. బహుముఖ ప్రజ్ఞతో ఆయా రంగాల్లో బాలకృష్ణ అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.
ఈ సందర్భంగా, భవిష్యత్తులో బాలకృష్ణ మరిన్ని నూతన శిఖరాలను అధిరోహించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. కళా, సేవా, రాజకీయ రంగాల్లో ఆయన ప్రస్థానం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సినీ నటుడిగా, ప్రజా ప్రతినిధిగా బాలకృష్ణ చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.