రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ తదుపరి సీఎస్ రామకృష్ణారావు
- తెలంగాణ నూతన సీఎస్ గా కె. రామకృష్ణారావు
- సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన రామకృష్ణారావు
- ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ శాంతికుమారి
ప్రస్తుతం కె. రామకృష్ణారావు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ జాబితా ప్రకారం ఆయనతో పాటు మరో ఆరుగురు అధికారులు వ్రధాన కార్యదర్శి పదవి రేసులో ఉండగా, ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించి కె. రామకృష్ణారావును నియమించాలని నిర్ణయించింది. ఆయన 2014 సంవత్సరం నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.