షాహిద్ ఆఫ్రిది పెద్ద జోక‌ర్‌.. ప‌నికిమాలినోడు: అస‌దుద్దీన్ ఒవైసీ

  • భార‌త ప్ర‌భుత్వం, సైన్యంపై నోరు పారేసుకున్న పాక్ మాజీ క్రికెట‌ర్‌
  • భార‌త సైన్యం చేత‌గానిత‌నం, వైఫ‌ల్యం కార‌ణంగానే ప‌హ‌ల్గామ్ దాడి అన్న ఆఫ్రిది 
  • ప‌నికిరాని వాళ్ల గురించి మాట్లాడడం దండ‌గ అంటూ ఆఫ్రిదిపై ఒవైసీ ఫైర్‌ 
భార‌త ప్ర‌భుత్వం, సైన్యంపై నోరు పారేసుకున్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి హైదరాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అత‌నో పెద్ద జోక‌ర్ అని, ప‌నికిరాని వాడు అంటూ విమ‌ర్శించారు. ప‌నికిరాని వాళ్ల గురించి మాట్లాడడం స‌మ‌యం వృథా త‌ప్ప ఏమీ ఉండ‌ద‌ని అన్నారు. 

ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వంపై ఆఫ్రిది తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అలాగే ఇండియ‌న్ ఆర్మీని కూడా దూషించాడు. భార‌త సైన్యం చేత‌గానిత‌నం, వైఫ‌ల్యం కార‌ణంగానే దాడి జ‌రిగింద‌ని వ్యాఖ్యానించాడు. భార‌త ప్ర‌భుత్వం త‌న త‌ప్పిదాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు ప్ర‌తిసారి పాకిస్థాన్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌రిపాటిగా మారింద‌ని ఆఫ్రిది అన్నాడు. 

మాజీ క్రికెట‌ర్ చేసిన అనుచిత‌ వ్యాఖ్య‌ల‌పై తీవ్రంగా స్పందించిన అస‌దుద్దీన్ ఒవైసీ.. వాడు పెద్ద జోక‌ర్ అంటూ విమ‌ర్శించారు. అలాగే దాయాది దేశంపై కేంద్రం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. సైబ‌ర్ దాడుల‌తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ కింద మిలిట‌రీ యాక్ష‌న్ తీసుకోవాల‌న్నారు. పాక్‌ను ఆర్థికంగా బ‌ల‌హీన‌ప‌రిచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌ధాని మోదీని కోరారు. మతం పేరిట అమాయ‌కుల‌ను చంపితే ఏ దేశం కూడా చూస్తూ ఊరుకోదని ఈ సంద‌ర్భంగా అస‌దుద్దీన్ ఒవైసీ హెచ్చ‌రించారు. 


More Telugu News