ముంబయి ఇండియన్స్ ఖాతాలో మరో రికార్డు

  • ఐపీఎల్‌లో ముంబయి జట్టుకు 150వ గెలుపు 
  • టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి టీమ్‌గా ముంబయి రికార్డు
  • 140 విజయాలతో రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్  

ముంబయి ఇండియన్స్ జట్టు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్ జట్టు 54 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ముంబయి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్‌లో ముంబయి జట్టుకు ఇది 150వ గెలుపు కావడం విశేషం. టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి టీమ్‌గా ముంబయి రికార్డుల్లోకి ఎక్కింది.

ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల విషయానికి వస్తే... ముంబయి ఇండియన్స్ 150 విజయాలతో మొదటి స్థానంలో ఉండగా, 140 విజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో, ఆ తర్వాత స్థానాల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (134), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (129), ఢిల్లీ క్యాపిటల్స్ (112) జట్లు నిలిచాయి.

ఇక, ఈ సీజ‌న్‌ను పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్రారంభించిన ఎంఐ.. ఆ త‌ర్వాత పుంజుకుని వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తోంది. తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఒక్క గెలుపుతో అభిమానులను నిరాశపరిచిన ముంబయి ఇండియన్స్ జట్టు... ఇప్పుడు వరుసగా ఐదో గెలుపు తన ఖాతాలో వేసుకుంది.


More Telugu News