పీఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీలో ట్విస్ట్
- స్వల్ప అస్వస్థతకు గురైన పీఎస్ఆర్
- వైద్య పరీక్షల్లో పీఎస్ఆర్ కు హైబీపీ
- తిరిగి జైలుకు పంపిన సీఐడీ అధికారులు
ఈ నేపథ్యంలో ఆదివారం పీఎస్ఆర్ ను కస్టడీలోకి తీసుకోవడానికి సీఐడీ అధికారులు విజయవాడ జైలుకు వెళ్లారు. ఈ క్రమంలో పీఎస్ఆర్ ఆంజనేయులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో పీఎస్ఆర్ ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో పీఎస్ఆర్ హైబీపీతో బాధపడుతున్నారని వైద్యులు తేల్చారు. ఈ పరిస్థితుల్లో కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపితే పీఎస్ఆర్ ఇబ్బంది పడే అవకాశం ఉందని సీఐడీ అధికారులు భావించారు. విచారణ జరిపే పరిస్థితి లేదని పీఎస్ఆర్ ఆంజనేయులును తిరిగి జైలుకు తరలించారు.