Bandar Abbas Port Explosion: ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టులో భారీ పేలుడు

Massive Explosion Rocks Bandar Abbas Port in Iran
షార్ట్స్‌లో చూడండి
ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. బందర్ అబ్బాస్ నగరంలోని రజాయే ఓడరేవులో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, దాదాపు 700 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కొన్ని కిలోమీటర్ల దూరంలోని భవనాల అద్దాలు ధ్వంసం కాగా, ఒక భవనం కుప్పకూలింది.

అణ్వాయుధాలపై ఇరాన్, అమెరికాలు ఒమన్‌తో మూడో విడత చర్చలు జరుపుతున్న సమయంలో, ఓడరేవులో శనివారం ఈ భారీ పేలుడు సంభవించడంతో దీని వెనుక ఏదైనా విద్రోహ చర్య ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇది దాడి కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొన్నారు.

బాలిస్టిక్ క్షిపణుల్లో ఘనరూప ఇంధనంగా వాడే సోడియం పెర్‌క్లోరేట్ రాకెట్ ఇంధనం గత నెలలో షాహీద్ రజాయే ఓడరేవులో దిగుమతి కాగా, చైనా నుండి రెండు నౌకల్లో ఇది వచ్చినట్లు తెలుస్తోంది. బందర్ అబ్బాస్ నగరానికి వెలుపల ఈ పోర్టు ఉండగా, ఇక్కడ పేలుడు ఎలా సంభవించింది అనే దానిపై అధికార వర్గాలు కొన్ని గంటల వరకు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు.

పేలుడు ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. "పారిపోండి.. పారిపోండి.. గ్యాస్ ట్రక్కును వెళ్లిపొమ్మనండి. అది పేలిపోతుంది. దేవుడా! ఇది పేలిపోతోంది. అందరూ ఖాళీ చేయండి.. పారిపోండి" అంటూ ఒక వ్యక్తి పెద్దగా అరుస్తున్న కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. పోర్టులో నిల్వ ఉన్న కొన్ని కంటైనర్లు పేలడంతో ప్రమాదం జరిగిందని స్థానిక విపత్తు నిర్వహణ అధికారి మెహర్దాద్ హసన్జాదే తెలిపారు.

Go Back to Shorts
Bandar Abbas Port Explosion
Iran Explosion
Bandar Abbas
Rajai port
explosion
fire
accident
Iran
Abbas Araghchi
China

More Telugu News