Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ లో హై అలర్ట్... మరోసారి ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాల హెచ్చరిక

Jammu and Kashmir on High Alert After Terrorist Attack
షార్ట్స్‌లో చూడండి
జమ్మూ కశ్మీర్ లో మినీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచిన పహల్గాంలోని బైసరన్ ప్రాంతం నిన్న ఉగ్రదాడితో నెత్తురోడిన సంగతి తెలిసిందే. పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యలో 28 మంది బలయ్యారు. కాగా, జమ్మూకశ్మీర్ లో మరోసారి ఉగ్రదాడి జరగొచ్చని నిఘా వర్గాలు తాజాగా హెచ్చరికలు జారీ చేశాయి. దాంతో జమ్మూకశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటించారు. పలు కీలక ప్రాంతాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. శ్రీనగర్, ఉధంపూర్ తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడిక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. 

మరోవైపు, ఉగ్రదాడికి నిరసనగా నేడు జమ్మూకశ్మీర్ లో బంద్ కొనసాగుతోంది. ఈ బంద్ లో ప్రజలు, దుకాణదారులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.
Go Back to Shorts
Jammu and Kashmir
Terrorist Attack
High Alert
Security Forces
India
Srinagar
Udhampur
Pakistan
Terrorism
Bandh

More Telugu News