ఇది అందరినీ నవ్వించే సినిమా: సంపూర్ణేష్ బాబు

Sampurnesh Babus Sodara A Hilarious Family Drama
సంపూర్ణేష్‌బాబు హీరోగా నటించిన ‘సోదరా’ సినిమా విడుదలకు సిద్ధమైంది. మన్‌మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం మీడియాతో ముచ్చటించింది. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ.. ‘సోదరా’ సినిమా అందరినీ నవ్విస్తుందని చెప్పాడు. ఇది కుటుంబంలోని అన్నదమ్ముల కథ అని, ప్రతి ఒక్కరినీ నవ్విస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో ఏడిపిస్తుందని కూడా చెప్పారు. సినిమా చూస్తుంటే నిజ జీవితంలో జరిగిన ఘటనలు గుర్తుకు వస్తాయని పేర్కొన్నాడు. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఎంత ఉంటుందో, ఎమోషన్ కూడా అంతే ఉంటుందని సంపూ తెలిపాడు. ఫ్యామిలీ మొత్తం ఎంచక్కా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని వివరించాడు. ‘ఎ’ సినిమాలో ఉపేంద్ర లాంటి పాత్ర చేయాలని ఉందని సంపూర్ణేష్ చెప్పుకొచ్చాడు.  

ఈ మూవీలో నటిస్తున్న మరో నటుడు సంజోష్ మాట్లాడుతూ.. సంపూర్ణేష్‌తో కలిసి బ్రదర్‌లా నటించడం చాలా సంతోషంగా ఉందన్నాడు. అన్నదమ్ముల మధ్య తలెత్తే మనస్పర్థలను ఈ సినిమా ఎత్తి చూపిస్తుందని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరినీ ఇది టచ్ చేస్తుందన్నారు. ఈ మూవీ చూస్తే అన్నదమ్ముల బంధాలు మరింత బలపడతాయని చెప్పారు. నేటి తరం ప్రేక్షకులకు తగ్గట్టుగా ఎమోషన్‌తోపాటు కామెడీని కూడా మిక్స్ చేసి చూపిస్తున్నట్టు సంజోష్ వివరించాడు.
Go Back to Shorts
Sampurnesh Babu
Sodara Movie
Telugu Movie
Comedy Movie
Family Drama
Manmohan Meenampalli
Sanjosh
Telugu Cinema
Upcoming Telugu Film
Brothers Story

More Telugu News