అరుదైన నాయకుడు మీరు అంటూ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్
- నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు వేడుకలు
- ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన మెగా స్టార్ చిరంజీవి
దార్శనికత, కృషి, పట్టుదల, అంకితభావం ఉన్న అరుదైన నాయకుడు మీరు అంటూ చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. ఆ భగవంతుడు చంద్రబాబుకు ఆయురారోగ్యాలతో పాటు ప్రజల కోసం కనే కలలు నెరవేర్చే శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.