ప్రేమ వివాహం చేసుకున్న కేజ్రీవాల్ కూతురు.. స్టెప్పులేసిన పంజాబ్ సీఎం
- తన ప్రియుడు సంభవ్ జైన్ ను పెళ్లాడిన కేజ్రీవాల్ కూతురు హర్షిత
- ఐఐటీ ఢిల్లీలో చదువుతున్న సమయంలో ఇద్దరికీ పరిచయం
- ఇటీవలే ఒక స్టార్టప్ ను ప్రారంభించిన జంట
కూతురు వివాహాన్ని కేజ్రీవాల్ దగ్గరుండి తన చేతుల మీదుగా జరిపించారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తదితర ప్రముఖులు వచ్చేశారు. సంగీత్ కార్యక్రమంలో సీఎం భగవంత్ మాన్ బాంగ్రా డ్యాన్స్ చేసి అందరినీ అలరించారు.
మరోవైపు హర్షిత, సంభవ్ జైన్ ఇద్దరూ ఐఐటీ ఢిల్లీలో చదువుతున్న సమయంలో పరిచయం అయ్యారు. ఈ క్రమంలో వారి స్నేహం ప్రేమగా మారింది. వీరిద్దరూ ఇటీవలే ఒక స్టార్టప్ ను కూడా ప్రారంభించారు.