రేపు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన వీహెచ్పీ
- వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ బెంగాల్ లో హింసాత్మక ఘటనలు
- బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని వీహెచ్పీ డిమాండ్
- అన్ని రాష్ట్రాల్లోని వీహెచ్పీ సభ్యులు, మద్దతుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు
బెంగాల్ హింసాత్మక ఘటనలకు వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు వీహెచ్పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాల్లోని వీహెచ్పీ సభ్యులు, మద్దతుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. బెంగాల్ లో ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల మేజిస్ట్రేట్లకు మెమోరాండం సమర్పించాలని చెప్పారు.