కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం... నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!
వీరు హిందూపురం నుంచి కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా షహర్‌పూర్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ ఆనంద్ గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గబ్బూర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.