ముగిసిన వివాదం.. రాజ్ తరుణ్ తల్లిదండ్రులను ఇంట్లోకి అనుమతించిన లావణ్య
- లావణ్య ఇంటికి మొన్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు
- కేసు కోర్టులో ఉందని లోపలికి అనుమతించని లావణ్య
- పోలీసుల జోక్యంతో పట్టు వీడిన లావణ్య
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు జోక్యం చేసుకొని వారిని ఇంట్లోకి అనుమతించాలని లావణ్యకు సూచించారు. పోలీసుల సూచనతో లావణ్య వారిని ఇంట్లోకి అనుమతించారు. ఈ సందర్భంగా బస్వరాజ్, రాజేశ్వరి మాట్లాడుతూ లావణ్య తమ కోడలు కాదని, తమ కుమారుడు ఆమెను పెళ్లి చేసుకోలేదని తెలిపారు. ఆమెతో సహజీవనం మాత్రమే చేశాడని, కాబట్టి ఆమెను కోడలిగా అంగీకరించబోమని స్పష్టం చేశారు.