జూనియర్ ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేసిన రాజమౌళి
- జపాన్ లో విడుదలవుతున్న 'ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్' డాక్యుమెంటరీ
- ప్రమోషన్ కోసం జపాన్ కు వెళ్లిన రాజమౌళి
- తారక్ అద్భుతమైన నటుడన్న దర్శక దిగ్గజం
'కొమురం భీముడో' వంటి కష్టమైన పాటను చిత్రీకరించడం ఎన్టీఆర్ వల్లే తనకు సులభమయిందని రాజమౌళి చెప్పారు. ఆ పాటలో తారక్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అన్నారు. శరీరంలోని అణువణువులో తారక్ హావభావాలను పలికించాడని కితాబునిచ్చారు. తారక్ అద్భుతమైన నటుడని ప్రశంసించారు. ఆ పాట వెనుక కొరియోగ్రాఫర్ ప్రతిభ కూడా ఉందని అన్నారు.
తారక్ విషయానికి వస్తే... బాలీవుడ్ లో సత్తా చాటేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న 'వార్-2' సినిమాలో తారక్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయిక. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.