చిన్నారుల ఆప‌రేష‌న్‌కు మ‌హేశ్ బాబు సాయం.. ఎంబీ ఫౌండేష‌న్ ట్వీట్‌!

  
గుండె సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు హీరో మ‌హేశ్ బాబు ఉచితంగా ఆప‌రేష‌న్స్ చేయిస్తోన్న విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో ముగ్గురు పిల్ల‌ల‌కు శ‌స్త్ర‌చికిత్స చేయించిన‌ట్లు ఎంబీ ఫౌండేష‌న్ ట్వీట్ చేసింది. 

వ‌ర‌ల‌క్ష్మి (2 నెల‌లు), పూజ్య‌శ్రీ ఫ‌నీక్ష (8 నెల‌లు), పండూరి ఇముగ్ధ శ్రీ (5 నెల‌లు)ల‌కు హార్ట్ ఆప‌రేష‌న్లు చేసి కాపాడిన‌ట్లు పేర్కొన్నారు. కాగా, మ‌హేశ్ బాబు ఫౌండేష‌న్ ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు 4,500కి పైగా స‌ర్జ‌రీలు జ‌రగ‌డం విశేషం.  




More Telugu News