Raj Tarun: రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్ట్.. లావణ్య ఇంటికి రాజ్ తరుణ్ తల్లిదండ్రులు

Raj Tarun Lavanya Case Takes a New Twist Parents Visit Lavanyas House
  • సూరారంలో ఉంటున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు
  • అద్దె ఇంట్లో ఇబ్బంది అవుతోందంటూ కోకాపేటలోని ఇంటికి
  • కోర్టులో కేసులు ఉన్నాయని అడ్డుకున్న లావణ్య
  • విషయం తెలిసి వెళ్లిన కొరియోగ్రాఫర్ శేఖర్‌బాషా 
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్-లావణ్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బస్వరాజ్, రాజేశ్వరి దంపతులు హైదరాబాద్‌లోని సూరారంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే, అద్దె ఇంట్లో ఇబ్బంది అవుతుండటంతో కొడుకు ఇంట్లో ఉంటామంటూ నిన్న కోకాపేటలోని లావణ్య ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో లావణ్య వారిని అడ్డుకున్నారు. కోర్టులో కేసులు ఉండటంతో ఇంట్లోకి రావడం కుదరదని చెప్పారు. అంతగా ఇంట్లోకి రావాలనుకుంటే పోలీసులతో మాట్లాడిన తర్వాత రావాలని చెప్పారు. దీంతో వారు సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. 

ఈ సందర్భంగా లావణ్య మాట్లాడుతూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తమపై దాడికి వచ్చారని ఆరోపించారు. ఈ ఇంటిని తాను, రాజ్ తరుణ్ కలిపి కొన్నామని, తాను రూ. 70 లక్షలు ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు వారి తల్లిదండ్రులు వచ్చి ఆ ఇల్లు తమదని అంటున్నారని పేర్కొన్నారు. ఆ ఇంటిపై తనకు హక్కు ఉందని తెలిపారు. తాము ఆ ఇంటిని కొన్నప్పుడు రూ. 1.5 కోట్లు మాత్రమేనని, ఇప్పుడు రూ. 12కోట్ల వరకు ఉంటుందని వివరించారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తన ఇంట్లోకి వచ్చి వస్తువులను ధ్వంసం చేశారని ఆరోపించారు. తనను ఈడ్చుకుంటూ వెళ్లి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. 

ఈ వివాదంపై రాజ్ తరుణ్ ఇప్పటి వరకు స్పందించలేదు. విషయం తెలిసిన కొరియోగ్రాఫర్ శేఖర్‌బాషా అక్కడికి చేరుకుని మీడియాతో మాట్లాడారు. రాజ్ తరుణ్ తల్లిదండ్రులకు న్యాయం జరిగే వరకు అక్కడే ఉంటానని చెప్పారు. కాగా, ఈ విషయమై తమకు ఎవరి నుంచి ఫిర్యాదులు అందలేని నార్సింగి పోలీసులు తెలిపారు.   
Raj Tarun
Lavanya
Property Dispute
Hyderabad
Tollywood Actor
Legal Case
Court Case
Family Dispute
Narsingi Police
Shekhar Basha

More Telugu News