కంటి పైభాగంలో స్క్రూడ్రైవర్.. ఆపరేషన్ చేసి తొలగించిన గాంధీ వైద్యులు
––
ఈ నెల 8న గ్రామంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ స్క్రూడ్రైవర్ కుడి కంటి పైభాగంలో దిగబడింది. దీంతో కుటుంబ సభ్యులు రంజిత్ ను బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు నిమ్స్‌కు ఆపై ఈ నెల 10న గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో స్క్రూడ్రైవర్ కంటి పైభాగంలో గుచ్చుకుందని, అందువల్ల కంటి లోపల గాయం కాలేదని తేలింది. దీంతో న్యూరోసర్జరీ వైద్యులు రెండు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించి స్క్రూడ్రైవర్ ను బయటకు తీశారు. శస్త్రచికిత్స విజయవంతం అయిందని, ప్రస్తుతం రంజిత్ కోలుకుంటున్నాడని డాక్టర్ రాజకుమారి తెలిపారు.