Devi Sri Prasad: రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్‌కు ఏపీ పోలీసుల ఊహించని షాక్!

- విశాఖపట్నంలో డీఎస్‌పీ మ్యూజిక్ కాన్సర్ట్‌కు పోలీసుల అనుమతి నిరాకరణ
- ఈ నెలలో విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లో మ్యూజిక్ కాన్సర్ట్‌కు ప్లాన్
- భద్రతా కారణాల దృష్ట్యా పర్మిషన్ ఇవ్వలేమన్న సీపీ శంఖబ్రత బాగ్చి
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్‌కు ఏపీ పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ నెలలో విశాఖపట్నంలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్‌లో డీఎస్‌పీ నిర్వహించాలనుకున్న మ్యూజిక్ కాన్సర్ట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా పర్మిషన్ ఇవ్వలేమని సీపీ శంఖబ్రత బాగ్చి చెప్పారు.
కాగా, విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వల్డ్‌లో ఇటీవల ఓ బాలుడు మునిగి మృతిచెందాడు. ఈ ఘటన నేపథ్యంలోనే దేవీశ్రీకి అనుమతి నిరాకరించినట్లు సమాచారం. అయితే, ఈ కాన్సర్ట్‌కు సంబంధించి నిర్వాహకులు ఇప్పటికే చాలా ఏర్పాట్లు చేశారు. భారీగా ఆన్‌లైన్‌లో టికెట్లు కూడా విక్రయించారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో డీఎస్‌పీతో పాటు నిర్వాహకులు, షో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు.