Vijay Deverakonda: విజయ్ దేవరకొండపై చులకన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ జర్నలిస్ట్

- విజయ్ దేవరకొండను సూపర్ స్టార్ గా బాలీవుడ్ మీడియా చూపించిందన్న హిమేశ్
- టాలీవుడ్ కి వచ్చి చూస్తే ఇక్కడ పెద్ద స్టార్ కాదని వ్యాఖ్య
- విజయ్ టైర్-2 హీరో మాత్రమేనని ఎద్దేవా
టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. పలు హిట్ సినిమాలతో స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండకు ఇటీవలి కాలంలో పెద్ద హిట్ రాలేదు. మరోవైపు బాలీవుడ్ లో సైతం విజయ్ దేవరకొండ పేరు మారుమోగింది. అయితే దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'లైగర్' సినిమా ఫ్లాప్ కావడంతో పరిస్థితి తలకిందులయింది.
తాజాగా బాలీవుడ్ లోని ప్రముఖ మీడియా జర్నలిస్ట్ హిమేశ్ మన్కడ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. విజయ్ దేవరకొండ గురించి బాలీవుడ్ మీడియా చేసిన ప్రచారం తనకు షాక్ అనిపించిందని ఆయన అన్నారు. 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ పెద్ద సూపర్ స్టార్ అన్నట్టుగా బాలీవుడ్ మీడియా చూపించిందని... కానీ టాలీవుడ్ కి వచ్చి చూస్తే ఆయన ఇక్కడ పెద్ద స్టార్ కాదని ఎద్దేవా చేశారు. ఆయన టైర్-2 హీరో మాత్రమేనని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.