Kandukuri Veeresalingam Pantulu: స్త్రీ జనోద్ధరణకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు: జగన్

- నేడు కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి
- సంఘ సంస్కర్తగా, సాహితీవేత్తగా ఆయన సేవలు చిరస్మరణీయమన్న జగన్
- ఆయన ఆశయాలు ఈ తరానికి స్ఫూర్తిదాయకమని వ్యాఖ్య
కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు వైసీపీ అధినేత జగన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.... స్త్రీ జనోద్ధరణకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు కందుకూరి వీరేశలింగం పంతులు అని జగన్ కొనియాడారు. తెలుగుజాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి అని ప్రశంసించారు. సంఘ సంస్కర్తగా, సాహితీవేత్తగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. వీరేశలింగం పంతులు ఆశయాలు ఈ తరానికి స్ఫూర్తిదాయకమని చెప్పారు.