Dil Raju: దిల్ రాజు బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

- 'క్వాంటమ్ ఏఐ గ్లోబల్'తో కలిసి ఏఐ స్టూడియో ప్రారంభిస్తున్నట్లు ప్రకటన
- అధునాతన ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుందని వ్యాఖ్య
- మరిన్ని వివరాలను మే 4న ప్రకటిస్తామన్న నిర్మాణ సంస్థ
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో మంగళవారం సాయంత్రం "బోల్డ్... బిగ్... బియాండ్ ఇమాజినేషన్" అంటూ ఓ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే ఈరోజు ఉదయం 11.08 గంటలకు ఎస్‌వీసీ కీలక ప్రకటన విడుదల చేసింది.
ఏఐ బేస్డ్ టెక్నికల్ కంపెనీ క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌తో కలిసి ఏఐ ఆధారిత మీడియా కంపెనీ (ఏఐ స్టూడియో)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వినోద పరిశ్రమ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అధునాతన ఏఐ సాధనాలను అభివృద్ధి చేయడానికి, అందించడానికి ఈ ఏఐ స్టూడియో పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ సంస్థ పేరు, మరిన్ని వివరాలను మే 4న ప్రకటిస్తామని తెలిపారు. ఈ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు భారతీయ సినిమా పరిణామ క్రమానికి సంబంధించిన ఓ వీడియోను కూడా దిల్ రాజు జోడించారు.