Bengaluru: పునరావాస కేంద్రంలో దారుణం.. రోగిని విచ‌క్ష‌ణార‌హితంగా కొట్టిన సిబ్బంది.. వీడియో వైర‌ల్‌!

Patient Brutally Assaulted At Rehab Centre Near Bengaluru

  • బెంగళూరు సమీపంలోని ఓ పునరావాస కేంద్రంలో ఘ‌ట‌న‌
  • ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన వైనం
  • ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెంగళూరు సమీపంలోని ఒక పునరావాస కేంద్రంలో దారుణం జ‌రిగింది. రిహేబిలిటేష‌న్ సెంట‌ర్‌లో చికిత్స పొందుతున్న ఓ రోగి ప‌ట్ల‌ ఇద్ద‌రు వ్య‌క్తులు క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించారు. రోగిపై క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. తీవ్రంగా కొట్టిన త‌ర్వాత రోగిని అక్క‌డి నుంచి ఈడ్చుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట వైర‌ల్‌గా మారింది. 

వీడియోలో రోగిని ఓ గదిలో బంధించి ఇలా దారుణంగా కొట్ట‌డం ఉంది. త‌న‌ను కొట్టవ‌ద్ద‌ని ఎంత వేడుకున్నా క‌నిక‌రించ‌కుండా దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచారు. ఆ వ్యక్తిని పదే పదే ఈడ్చుకుంటూ వెళ్లడం... వెంటనే మరొక వ్యక్తి కర్రతో అతన్ని కొట్టడం వీడియోలో చూడొచ్చు. ఈ ఘ‌ట‌న‌పై నెటిజన్లు మండిప‌డుతున్నారు. రోగి ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తించిన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 

కాగా, ఈ ఘ‌ట‌న బెంగళూరు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెలమంగళ గ్రామీణ పోలీస్ స్టేష‌న్‌ పరిధిలోని ఒక ప్రైవేట్ పునరావాస కేంద్రంలో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం... ఈ వీడియో ఇటీవలే వెలుగులోకి వచ్చింది. కానీ, ఈ సంఘటన చాలా రోజుల కింద జరిగింద‌ని స‌మాచారం. 

వీడియో వైర‌ల్ కావ‌డంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారంద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. వారిపై సుమోటో కేసు నమోదు చేశారు. వార్డెన్ దుస్తులు, బాత్రూమ్‌లు క్లీన్ చేయాల‌ని చెప్ప‌గా రోగి నిరాక‌రించాడు. దాంతో ఆగ్రహించిన వార్డెన్‌, మ‌రో వ్య‌క్తితో క‌లిసి అత‌నిపై దాడి చేసిన‌ట్లు పోలీసులు వెల్లడించారు. 


Bengaluru
Rehabilitation Center Abuse
Bengaluru Assault
Viral Video
Patient Brutally Beaten
Nelamangala Police
Private Rehabilitation Center
Karnataka Police
India Crime News
Wardens Arrested
Brutal Assault Video
  • Loading...

More Telugu News