Revanth Reddy: కేసు కొట్టివేయాలంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

- 2016లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు
- కేసును కొట్టివేయాలంటూ 2020లో రేవంత్ రెడ్డి పిటిషన్
- పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీకి ఆదేశం
గతంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. రేవంత్ రెడ్డిపై గతంలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
గోపన్‌పల్లిలోని భూవివాదంలో ఒక వ్యక్తి ఫిర్యాదు మేరకు 2016లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ కేసు రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణలో ఉంది. ఆ కేసును కొట్టివేయాలంటూ 2020లో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి, ఆ పిటిషన్‌ను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.