Ayyappa: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ .. బంగారు లాకెట్ల విక్రయం ప్రారంభం

Ayyappa Temple Launches Gold Locket Sale

  • శబరిమల అయ్యప్ప బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించిన టీవీబీ 
  • తొలి లాకెట్ అందుకున్న ఆంధ్రప్రదేశ్ భక్తుడు
  • ఆన్ లైన్ ద్వారా లాకెట్ల విక్రయం

అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు శుభవార్త తెలిపింది. దేవస్థానం బోర్డు ఇటీవల ఆవిష్కరించిన అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. పవిత్ర విషు పర్వదినం సందర్భంగా కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ సోమవారం లాకెట్ల విక్రయాలను ప్రారంభించారు.

శబరిమల ఆలయ గర్భగుడిలో ఉంచి పూజించిన బంగారు లాకెట్లను దేవస్థానం ఆన్‌లైన్ ద్వారా భక్తులకు విక్రయిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన తొలి లాకెట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తుడు అందుకున్నారు.

అయ్యప్ప రెండు గ్రాముల లాకెట్ ధర రూ.19,300, నాలుగు గ్రాముల లాకెట్ ధర రూ.38,600, ఎనిమిది గ్రాముల లాకెట్ ధర రూ.77,200లుగా నిర్ణయించారు. ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రకటన విడుదల చేసింది. 

Ayyappa
Sabarimala Temple
Gold Lockets
Travancore Devaswom Board
VN Vasavan
Kerala
Online Sale
Ayyappa Swamy
Temple Jewelry
Pilgrims
  • Loading...

More Telugu News