సెంచ‌రీ బాదిన ప్లేయ‌ర్‌కు గిఫ్ట్‌గా హెయిర్ డ్ర‌య‌ర్... పీఎస్ఎల్‌పై తెగ‌ ట్రోలింగ్‌!

    
ఈ నెల 11 నుంచి పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌) 10వ సీజ‌న్ జరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో క‌రాచీ కింగ్స్ జ‌ట్టు త‌మ విజయానికి కార‌ణ‌మైన బ్యాట‌ర్ విన్స్ (101 ప‌రుగులు)కు తాజాగా హెయిర్ డ్ర‌య‌ర్‌ను కానుక‌గా ఇచ్చింది. అత‌నికి జ‌ట్టు మేనేజ్‌మెంట్ దాన్ని ప్ర‌జెంట్ చేసిన వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది. 

దీంతో పీఎస్ఎల్‌పై నెట్టింట తెగ ట్రోలింగ్ జ‌రుగుతోంది. త‌ర్వాతి మ్యాచ్‌కు షాంపూను లేదా షేవింగ్ క్రీమ్ ఇస్తారేమోనంటూ నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. అటు నిర్వాహ‌కులు స్టేడియంలో ల‌క్కీ గిఫ్ట్ పేరిట బైక్‌ను ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచ‌డంతో వ‌చ్చే ఏడాది సైకిల్‌ను పెడ‌తారంటూ సోష‌ల్ మీడియాలో మీమ్స్ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  


More Telugu News