ఆ స‌మ‌యంలో కోహ్లీకి ఏమైంది?.. అభిమానుల క‌ల‌వ‌ర‌పాటు.. వైర‌ల్ వీడియో!

  • నిన్న‌ జైపూర్ వేదిక‌గా ఆర్ఆర్‌, ఆర్‌సీబీ మ్యాచ్
  • అజేయంగా 62 ర‌న్స్‌ చేసి ఆర్‌సీబీ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన కోహ్లీ
  • 54 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు ఒక్కసారిగా గుండె ప‌ట్టుకున్న విరాట్‌
  • ఆపై రాజ‌స్థాన్ కెస్టెన్ సంజూ శాంస‌న్ ద‌గ్గ‌రికి వెళ్లి హార్ట్‌బీట్ చెక్ చేయాల‌ని కోరిన వైనం
  • అది చూసిన ర‌న్ మెషీన్ అభిమానుల‌కు క‌ల‌వ‌ర‌పాటు
నిన్న‌ జైపూర్ వేదిక‌గా జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్‌)పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయం సాధించ‌డంలో విరాట్ కోహ్లీ అజేయంగా 62 పరుగులు చేసి, కీలక పాత్ర పోషించిన విష‌యం తెలిసిందే. అయితే, అర్ధ శ‌త‌కం పూర్త‌యిన త‌ర్వాత ర‌న్ మెషీన్ కొంత‌మేర ఆందోళ‌న‌గా క‌నిపించాడు. 

54 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న‌ప్పుడు ఒక్కసారిగా గుండె ప‌ట్టుకున్నాడు. ఆపై రాజ‌స్థాన్ కెస్టెన్ సంజూ శాంస‌న్ ద‌గ్గ‌రికి వెళ్లి హార్ట్‌బీట్ చెక్ చేయాల‌ని కోరాడు. దాంతో సంజూ కోహ్లీ ఛాతిపై చేయి పెట్టి చూశాడు. అనంత‌రం కోహ్లీ బ్యాటింగ్ కొన‌సాగించాడు. 

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో కొన్నేళ్లుగా అత్యంత ఫిట్‌గా ఉన్న క్రికెట‌ర్ల‌లో కోహ్లీ ఒక‌రు. అలాంటిది విరాట్ ఇలా క‌నిపించ‌డంప‌ట్ల అభిమానులను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది.  


More Telugu News