టీటీడీ అన్నదానానికి పవన్ అర్ధాంగి భారీ విరాళం
- ఇవాళ తిరుమల స్వామివారిని దర్శించుకున్న అన్నా లెజినోవా
- వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న పవన్ అర్ధాంగి
- వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్నం భోజనానికి రూ. 17లక్షలు వితరణ
తమ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవల సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడటంతో ఆమె స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుమారుడు కోలుకోవడంతో తిరుమలలో మార్క్ శంకర్ పేరు మీద ఈరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్నం భోజనానికి రూ. 17లక్షలు వితరణ చేశారు.