ఆ ఒక్క స‌ల‌హాతో మ్యాచ్‌ను ముంబ‌యి వైపు తిప్పేసిన‌ రోహిత్.. హిట్‌మ్యాన్‌ది నిజంగా మాస్ట‌ర్ మైండే!

  
ఆదివారం ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ), ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ చివ‌రివ‌ర‌కు ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన విష‌యం తెలిసిందే. ఆఖ‌రికి ముంబ‌యినే విజ‌యం వ‌రించింది. అయితే, ఈ మ్యాచ్ మ‌లుపు తిర‌గ‌డంలో ముంబ‌యి స్టార్ ప్లేయ‌ర్‌ రోహిత్ శర్మ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. 

ఢిల్లీ క్యాపిట‌ల్స్ బ్యాటింగ్ స‌మ‌యంలో 14వ ఓవ‌ర్‌కు ముందు ముంబ‌యి బాల్ ఛేంజ్ చేయించ‌గా, లెగ్ స్పిన్న‌ర్ క‌ర‌ణ్ శ‌ర్మ‌తో బౌలింగ్ వేయించాల‌ని డగౌట్‌లో ఉన్న హిట్‌మ్యాన్ సూచించాడు. దాంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అదే ప్లాన్‌ను అనుస‌రించాడు. 

అంతే... ఆ ఓవ‌ర్‌లో కీల‌క‌మైన స్ట‌బ్స్ వికెట్ ప‌డింది. ఆ త‌ర్వాత డీసీ మ్యాచ్‌పై నియంత్ర‌ణ‌ను కోల్పోయింది. దీంతో రోహిత్ స్ట్రాట‌జీ అద్భుత‌మని, హిట్‌మ్యాన్‌ది నిజంగా మాస్టర్ మైండ్ అంటూ నెటిజ‌న్లు, క్రికెట్ అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు.  


More Telugu News