ఉప్ప‌ల్ స్టేడియంలో దొంగ‌ల చేతివాటం

  • శ‌నివారం నాడు ఉప్ప‌ల్‌లో త‌ల‌ప‌డ్డ‌ పీబీకేఎస్‌, ఎస్ఆర్‌హెచ్
  • ఈ మ్యాచ్‌లో ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగి తేల‌గా సెల్ ఫోన్ దొంగ‌ల చేతివాటం 
  • స్టేడియంలో భ‌ద్ర‌త‌లో దాదాపు 3 వేల‌కు పైగా పోలీసుల ప‌హారా
  • అయినా భారీగా మొబైల్ ఫోన్ల చోరీ
  • ఉప్ప‌ల్ పోలీసుల‌ను ఆశ్రయించిన బాధితులు
ఉప్ప‌ల్‌లోని రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శ‌నివారం పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌), స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్) త‌ల‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో అభిమానులు ఆనందంలో మునిగి తేల‌గా సెల్ ఫోన్ దొంగ‌లు చేతివాటం చూపించారు. స్టేడియంలో భ‌ద్ర‌త‌లో దాదాపు 3 వేల‌కు పైగా పోలీసులు ప‌హారా కాస్తున్నా... సెల్ ఫోన్లను కాజేయడంతో బాధితులు ఉప్ప‌ల్ పోలీసుల‌ను ఆశ్రయించిన‌ట్లు తెలిసింది. 

15 నుంచి 20 మంది త‌మ‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు ఉప్ప‌ల్ సీఐ ఎల‌క్ష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ పెను విధ్వంసం సృష్టించిన విష‌యం తెలిసిందే. కేవలం 40 బంతుల్లోనే శ‌త‌కం బాదాడు. దీంతో పీబీకేఎస్ నిర్దేశించిన 246 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని స‌న్‌రైజ‌ర్స్ ఇంకా 9 బంతులు మిగిలి ఉండ‌గానే, 8 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.   




More Telugu News