PV Sindhu: దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు.. క్షేమంగా ఉన్నానంటూ సందేశం
- దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన పీవీ సింధు
- మధ్యప్రాచ్య సంక్షోభంతో నిలిచిపోయిన విమాన సర్వీసులు
- తాను క్షేమంగా ఉన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడి
- ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ కోసం బర్మింగ్‌హామ్ వెళ్తుండగా ఘటన
- సింధుతో టచ్‌లో ఉన్నామన్న భారత బ్యాడ్మింటన్ సంఘం
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా విరుచుకుపడుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోవడంతో దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తాజాగా స్పందించింది. తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని వెల్లడించింది
ప్రతిష్ఠాత్మక ఆల్-ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో (మార్చి 3-8) పాల్గొనేందుకు సింధు శనివారం బర్మింగ్‌హామ్‌కు బయలుదేరింది. ఈ నేపథ్యంలో దుబాయ్ మీదుగా ఆమె ప్రయాణం సాగాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాల రీత్యా ఆమె విమానాన్ని దుబాయ్ విమానాశ్రయానికి తిరిగి మళ్లించారు. దీనిపై సింధు ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. "నేను క్షేమంగా ఉన్నాను. నా యోగక్షేమాల గురించి మెసేజ్‌లు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితి ఉంది. ఎన్నో కుటుంబాలు ఇక్కడ చిక్కుకుపోయాయి. అంతా త్వరగా సర్దుకుంటుందని ఆశిస్తున్నా" అని ఆమె పేర్కొంది.
ఈ విషయంపై భారత బ్యాడ్మింటన్ సంఘం (BAI) స్పందించింది. తాము సింధుతో నిరంతరం టచ్‌లో ఉన్నామని, ఎమిరేట్స్ అధికారులతో మాట్లాడుతున్నామని బీఏఐ వర్గాలు తెలిపాయి. మిగతా ఆటగాళ్లు ఇప్పటికే బర్మింగ్‌హామ్ చేరుకోగా, సింధు శనివారం ఉదయం బయలుదేరారని పేర్కొన్నాయి. మరోవైపు, పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఇప్పటికే సురక్షితంగా బర్మింగ్‌హామ్ చేరుకున్నారు.
ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఇరాన్‌పై వైమానిక దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో సంక్షోభం ముదిరింది. దీనికి ప్రతిగా ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో నౌకలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ పరిణామాలతో యూరప్, ఆఫ్రికా వెళ్లే విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు దుబాయ్ విమానాశ్రయం కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది.